ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ లో ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూసినా సరే ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఎన్ని విధాలుగా హైకోర్ట్ లో కేసులు గెలవాలి అని ప్రయత్నాలు చేసినా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు అనే చెప్పాలి. రాజకీయంగా బలంగా ఉన్నా సరే హైకోర్ట్ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానికి చికాకుగా మారింది. అటు వైసీపీ సీనియర్ నేతలు కూడా ఈ పరిణామంపై ఆందోళనకరంగా ఉన్నారు.
దేశ వ్యాప్తంగా ఏ ప్రభుత్వం కూడా హైకోర్ట్ లో ఈ విధంగా కేసులు ఎదుర్కొన్న సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఈ నేపధ్యంలోనే హైకోర్ట్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ న్యాయవాదులు ముగ్గురు పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్ బాబు, షేక్ హబీబ్ తమ పదవులకు రాజీనామా చేయడం సంచలనంగా మారింది అనే చెప్పాలి. తీర్పులు ప్రతీ ఒక్కటి కూడా వ్యతిరేకంగా రావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
ఇక వారి స్థానంలో త్వరలోనే ముగ్గురు కొత్త న్యాయవాదులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తుంది. అయితే వాళ్ళు రాజీనామా చేయడానికి ప్రధాన కారణం నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం అని పరిశీలకులు అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని విధాలుగా కేసు గెలవాలి అని భావించి చివరికి సుప్రీం కోర్ట్ కి వెళ్ళినా సరే అది సాధ్యం కాలేదు. దీనితో ఆ ముగ్గురిని తప్పుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచనలు చేసినట్టు సమాచారం.