ఆ యువతిని ఆదుకున్న కేటీఆర్..!

-

తెలంగాణ మంత్రి కేటీఆర్ కి ప్రజల్లో రోజురోజుకి ఆదరణ పెరిగిపోతుంది. దానికి కారణం ఆయన చేసే పనులు. ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే ఇట్టే పరిష్కరిస్తున్నారు ఆయన. అలాగే ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ప్రజలతో తన బంధాన్ని పెంచుకుంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తూ నాయకుడంటే ఇలా ఉండాలి అని అనిపించుకున్నారు. తాజాగా ఓ ప్రమాదంలో కాళ్ళు చేతులు పనిచేయని మహిళకు సహాయం చేశారు కేటీఆర్. నెలకొండపల్లికి చెందిన తుపాకుల స్వాతి విద్యుద్ఘాతానికి గురవడంతో రెండు చేతులు పనిచేయడం లేదు. ఒక కాలు సగం వరకు తీసేసారు. నిరుపేద కుటుంబానికి చెందిన స్వాతి పడుతున్న ఆర్థిక కష్టాల గురించి తెలుసుకున్న కేటీఆర్ స్వాతిని ఆదుకుంటామని గత ఏప్రిల్ లో హామీ ఇవ్వగా..తాజాగా సీఎంఆర్‌ఎఫ్ నుండి లక్ష రూపాయలు మంజూరు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news