ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే పదోతరగతి పరీక్షలపై కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఇకపోతే తెలంగాణలో కూడా ఇప్పటికే పదోతరగతి పరీక్షలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని విద్యార్థులంతా ఎదురుచూస్తున్న సమయంలో.. ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు తేదీని ఖరారు చేసినట్లు తెలుస్తుంది. దీంతో ఈ నెల 18న తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు. కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 95.72 శాతం మంది హాజరయ్యారు.
ఇంటర్ ఫలితాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!
-