జగన్ రెండు షోకాజ్ నోటీసులు రెడీ చేస్తున్నారు… రాజు, రెడ్డి రెడీనా?

-

తానునమ్మిన తననునమ్మిన జానాలకోసం, తాను ఏమనుకున్నారో ఎలా అనుకున్నారో అలానే చేసుకుపోతున్నారు ఏపీ సీఎం జగన్! ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ఆలోచన చేయని జగన్… కరోనా కష్టకాలంలో, ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయినా అప్పు చేసైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో పార్టీని పూర్తిగా వదిలేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి.

కరోనా సమయంలో రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడటం వల్ల.. ఎమ్మెల్యేలకు వారి వారి నియోజకవర్గాలకు సంబందించిన కొన్ని విషయాల్లో న్యాయం చేయలేకపోతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో జగన్ పరిస్థితిని కొందరు అర్ధం చేసుకుని సర్థుకుపోతుంటే… మరికొందరు మాత్రం దిక్కార స్వరం వినిపిస్తున్నారు.

ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, అధినేత పరిస్థితిని అర్ధం చేసుకోని కొందరు నేతలు మైకులముందుకు వచ్చి హడావిడి చేశారు. తర్వాతికాలంలో వారిలో కొందరికి అర్ధం అయ్యిందో లేక అర్థం చేశారో తెలియదు కానీ… కొందరు మాత్రం సైలంట్ అయ్యారు. కానీ… ఇద్దరు నేతలు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. ప్రభుత్వంపైనా, పరోక్షంగా అధినేతపైనా విమర్శలు గుప్పిస్తూనే వస్తున్నారు. వారిలో తొలి రెండుస్థానాల్లోనూ పోటీపడుతున్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి!

దీంతో వీరి తలనొప్పులు రోజు రోజుకీ మరీ ఎక్కువవుతుండటంతో… వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని పార్టీ పెద్దలు సూచిస్తున్నారట! దానికి జగన్ కూడా సరే అన్నట్లు సమాచారం! ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి వారి వివరణ తీసుకున్న అనంతరం.. ఆ వివరణలు అధినేతను, పార్టీ పెద్దలను సంతృప్తి పరచని నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని చూస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయంలో సామాజికవర్గాల ఫీలింగ్స్ జగన్ కు ఏమీ లేవని… పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించే వారి విషయంలో వెనక్కి తగ్గే ఆలోచనలేదని తేల్చినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news