నిర్ల‌క్ష్యం వ‌ద్దు.. జాగ్ర‌త్త‌లు పాటించండి: జాతినుద్దేశించి మోదీ ప్ర‌సంగం.!

-

  • ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అన్‌ లాక్‌-2లోకి ప్రవేశిస్తున్నామని తెలిపారు. జలుబు, దగ్గు వంటి వ్యాధుల సీజన్‌ లోకి ప్రవేశిస్తున్నామన్నారు. అన్‌లాక్‌-1 తర్వాత ప్రజల వ్యవహారశైలిలో నిర్లక్ష్య ధోరణి కనిపించిందని, నిర్లక్ష్య ధోరణిని వదిలించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. లాక్‌ డౌన్‌ కాలంలో ఎంతో నియమనిష్టలు పాటించామని, అలాంటి కట్టుబాట్లను తిరిగి దేశమంతా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
  • రాబోయే రోజుల్లో పండగలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే నవంబరు ఆఖరు వరకు పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని పొడిగిస్తున్నాం. రూ. 90 కోట్ల అదనంగా కేటాయిస్తున్నాం. ప్రతి కుటుంబానికి నెలకు 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలు, కిలో కందిపప్పు ఇస్తాం. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ విదానంతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది.
  • బయటకు వచ్చే ప్రతిఒక్కరూ మాస్క్‌లు ధరించాలి. భౌతికదూరం పాటించాలి.
  • కంటైన్మెంట్‌ జోన్లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
  • నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే జరిమానా విధించాలి.
  • లాక్‌డౌన్‌తో లక్షలాది ప్రాణాలను కాపాడగలిగాం

Read more RELATED
Recommended to you

Latest news