భార్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంది.. భర్తను చచ్చిపో అన్నది..!

-

అతడి పేరు ప్రశాంత్. సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఊరు కామారెడ్డి. 2014 లో పెళ్లయింది. భార్య పేరు పావని. ఊరు వరంగల్. ఆమె కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరే. శ్రీనగర్ కాలనీలో కాపురం పెట్టారు. కొన్నేళ్లు వీళ్ల కాపురం సజావుగా సాగింది. తర్వాత గొడవలు ప్రారంభమయ్యాయి. దానికి తోడు పిల్లలు కూడా పుట్టలేదు. మరోవైపు పావని.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నదని ప్రశాంత్ కు తెలిసింది. పావనిని మందలించాడు. అయినా ఆమె మారలేదు. ఉల్టా ప్రశాంత్ నే తిట్టింది. వేధించింది. నువ్వే చచ్చిపో అంటూ కోప్పడింది. దీంతో ప్రశాంత్ మానసికంగా కుంగిపోయాడు. గత ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ప్రశాంత్ సూసైడ్ నోట్ రాశాడు. దాంట్లో తన భార్య అక్రమ సంబంధానికి సంబంధించిన విషయాలను వెల్లడించాడు.

అయితే.. ప్రశాంత్ ఆత్మహత్యలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. భర్య వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో తన పరువు ఎక్కడ పోతుందోనని భయపడ్డ ప్రశాంత్.. ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యకు వారం ముందు తన బావతో మాట్లాడాడు. దానికి సంబంధించిన ఫోన్ సంభాషణ బయటికి వచ్చింది. తన బావ సలహా ప్రకారం తన భార్యను హైదరాబాద్ నుంచి బెంగళూరు పంపించాడట. అయినా… పావని తన తీరు మార్చుకోకపోవడం.. వేరే వ్యక్తితో తన సంబంధాన్ని కంటిన్యూ చేస్తుండటంతో భరించలేకనే ప్రశాంత్ సూసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news