ఈ కరోన కాలంలో విదేశాల్లో చిక్కుకపోయిన వారిని స్వస్థలాలకు పంపేందుకు ఉన్నత అధికారులు విమానయాన శాఖా అధికారులు ఎంతగానో కష్టపడుతున్నారు. చిక్కుకుపోయిన వారి గురించి ప్రత్యేఖ విమానాలు ఏర్పాటు చేసి మరీ తమ స్వస్థలాలకు చేరుస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి కుదురుగా ఉండి ఇళ్లకు సురక్షితంగా చేరుకోవాలి కానీ దుబాయి కి చెందిన ఓ భారత సంతతి వ్యక్తి ఫుల్ గా మందు కొట్టి బిర్రుగా పడుకున్నాడు. విమానం వచ్చింది వెళ్లిపోయింది కూడా అతనికి తెలియలేదు దాంతో ఇప్పుడు దుబాయ్ విమానాశ్రయంలో ఖాళీ జోబులతో ఉంటూ వారు పెట్టిన స్నాక్స్ తింటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మన దగ్గరి వందే భారత్ అభియాన్ తరహాలోనే దుబాయ్ లో కూడా ఓ పథకం ద్వారా అధికారులు ప్రయాణికులను తమ స్వస్థలాలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దుబాయ్ నుండి భారత్ లోని కేరళకు వెళ్ళేందుకు ఓ ప్రత్యేఖ విమానాన్ని ఏర్పాటు చేశారు దుబాయ్ లోని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ (కేఎంసీసీ). ఈ విమానానికి గాను అందరూ ముందే టికెట్ లు కొనుగోలు చేశారు. అయితే ఈ విమనంలో కేరళకు వచ్చేందుకు షాజహాన్ అనే వ్యక్తి దాదాపుగా 1100 దిర్హామ్ లను ఖర్చు పెట్టి టికెట్ కొనుకున్నాడు. విమానం ఎక్కెందుకు అన్నీ సద్దుకొని విమానం రాక కన్నా కొన్ని గంటల ముందే అక్కడకు వచ్చేశాడు. విమానం వచ్చేందుకు ఇంకా చాలా సమయం ఉంది దాంతో ఫుల్ గా మందు కొట్టి బిర్రుగా పడుకున్నాడు.విమానం వచ్చింది ఈ విమానానికి సమన్వయకర్తగా ఉన్న ఎస్ నిజాముద్దీన్ కొల్లాం… విమానం వచ్చిన తరువాత, బోర్డింగ్ ముగియగా, షాజహాన్ ఎక్కడో గుర్తించలేకపోయారు. దాంతో విమానం టెక్ ఆఫ్ అయిపోయింది విమానం వెళ్ళిపోయిన తరువాతా చాలాసేపటికి షాజహాన్ లేచి విమానం ఎక్కడా అని అధికారులను ప్రశ్నించాడు. విమానం వెళ్లిపోయిందని చెప్పడం తో ఇప్పుడు అక్కడే కూర్చొని వారు పెట్టిన స్నాక్స్ తింటున్నాడు. అతని దగ్గర్ మరో టికెట్ కొనడానికి కూడా డబ్బు లేవు దీంతో అధికారులే చోరువ తీసుకొని వేరే విమానంలో పంపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.