ఆ ఎమ్మెల్యేల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క!

-

టీడీపీలో అంందరిది ఒకరకం ఇబ్బంది అయితే… విశాఖ జిల్లానుంచి గెలిచిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేల ఇబ్బంది మరోరకం! నాడు అమరావతిపేరు చెప్పి టీడీపీ నేతలంతా వందల ఎకరాలు కొన్నారని జగన్ సర్కార్ చెబుతున్న లిస్ట్ లో వీరి పేర్లు ఉన్నాయో లేదో తెలియదు కానీ… అమరావతిలోనే ఏపీ రాజధాని అనే విషయం వీరిని మామూలుగా ఇబ్బంది పెట్టడం లేదట!

తమ సొంత జిల్లాలో రాజధాని వస్తుంది.. అంతకు మించిన ఆనందం ఏముంది? మరి అలాంటప్పుడు సంబరాలూ చేసుకోవాలి.. కానీ మౌనంగా ఉండాల్సిన పరిస్థితి! అమరావతి లోనే రాజధాని ఉండాలని దీక్ష చేయడం ప్రారంభించి 200రోజులు పూర్తయిన సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దీక్షల్లో ఈ నలుగురు ఎమ్మెల్యేల పరిస్థితిపై అనుమానాలు వస్తున్నాయంట!

పార్టీ అధినేతకు అనుకూలంగా… అమరావతిలోనే రాజధాని ఉండాలని అందామంటే… విశాఖ వాసుల ఆగ్రహానికి గురవ్వాలి! విశాఖ వాసుల కోరిక మేరకు విశాఖలోనే రాజధాని ఉండాలి అని అందామంటే… బాబు ఆగ్రహానికి బలవ్వాలి! అటు బాబు కోరికమేర అమరావతిని సపోర్ట్ చేయక, ఇటు జనం కోరిక మేర విశాఖనూ సపోర్ట్ చేయలేక.. విశాఖ టీడీపీ ఎమ్నెల్యేల పరిస్థితి అడగత్తెరలో పోకచెక్క అయ్యిందని అంటున్నారు!

అవిచాలవన్నట్లు తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ… నిజంగా చంద్రబాబుకు అమరావతిపై అంత ప్రేమ ఉంటే విశాఖ టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. అమరావతి కావాలో, విశాఖ కావాలో అప్పుడు ప్రజలే నిర్ణయిస్తారని అంటున్నారు. మళ్లీ ఇదో కొత్త సమస్యగా వచి పడింది ఆ నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలకు!!

Read more RELATED
Recommended to you

Latest news