ఏపీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన పోస్ట్‌

-

ఏపీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన పోస్ట్‌ పెట్టారు. లోక్ సభ ఎన్నికల నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ జరగనుందన్నారు. తెలుగు భాష, సంస్కృతి, గౌరవాన్ని రక్షించి, ప్రోత్సహించి, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని మతమార్పిడి, అవినీతి, దుష్పరిపాలన పంజాల నుండి విముక్తి చేసి, ఎస్సీ, ఎస్టీలు మరియు ఓబీసీల అభ్యున్నతి కోసం కృషి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అని ట్వీట్‌ చేశారు.

Amit Shah’s sensational post on AP elections

ఇక అటు తెలంగాణలో నేడు నాలుగో దశ పోలింగ్ జరగనుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని, గౌరవాన్ని పెంపొందించి, సుపరిపాలనను కొనసాగించి, వ్యవసాయ రంగంలో ఆర్థిక బలాన్ని నింపి, రైతుల సమస్యలపై శ్రద్ధ వహించి, బుజ్జగింపులు మరియు అవినీతిని అంతం చేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను. అభివృద్ధి, మరియు సమాన అవకాశాలను అందించడం ద్వారా SCలు, STలు మరియు OBCలకు అధిక లాభం చేకూరుతుందన్నారు అమిత్ షా.

 

Read more RELATED
Recommended to you

Latest news