ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం వార్ ఆఫ్ వర్డ్స్ చేసుకుంటూ ఉంటాయి. అది చూసిన ఎవరి అభిమానులు వాళ్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎంజాయ్ చేస్తుంటారు. అంతేకానీ… వీటి వల్ల వారికి వనగూరేది కూడా ఏం లేదనేది స్పష్టం. అయితే నిత్యం టీడీపీ జాతీయ కార్యదర్శి చంద్రబాబు పుత్రరత్నం నారా లోకేశ్ ట్విట్టర్ లో అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు. కేకలేస్తుంటారు. అవి లోకేశ్ స్టైల్లో అరిసినట్లుగానే ఉంటాయి.
అయితే తాజాగా లోకేశ్ ట్వీట్ చేస్తూ.. జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు పోలీసులు బాధిత కుటుంబంపైనే కేసు నమోదు చేసి వేధిస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా కనమలచెరువు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త నాసరయ్య కుటుంబంపై జగన్ రెడ్డి గూండాలు దాడి చేశారని ఆరోపించారు. అయితే పోలీసులు బాధితులపైనే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బాధితులకే వేధింపులు అంటూ కూడా విమర్శించారు. కక్ష సాధింపు కోసం జగన్ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని కూడా ఆవేశంతో ఊగిపోయినట్లు వెలువరించారు. జగన్ ట్రాప్ లో పడి అడ్డదారులు తొక్కుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు కూడా.
అందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు సోషల్ మీడియా వేదికగా కాచుకు కూర్చుంటారు. లోకేష్ ఏం మాట్లాడిన సార్వత్రికంగా టీడీపీపైనే నిత్యం చెలరేగిపోయిన మరీ ట్వీట్స్ సంధిస్తుంటారు. తాజాగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ… ‘తాను ట్వీట్ చేస్తే వైఎస్ఆర్సీపీ వణికి పోతుందన్నాడు చిట్టినాయుడు. జనం మాత్రం టిక్ టాక్ లేని లోటు తీరుస్తున్నాడంటున్నారు. తిండి ఖర్చుల గురించి ఆయన మాటలు విని నవ్వుకుంటున్నారు. ఏం చేసినా చిట్టినాయుడు స్టైలే వేరు. అన్నట్లు కొల్లును పరామర్శించావా? మర్చిపోయావా చిట్టి!’ అంటూ వెటకాల ధోరణలో విజయసాయిరెడ్డి మాటల తూటాలు పేల్చారు. అలాగే… ‘చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు.’ అంటూ అబ్బా కొడుకులను ఏకిపారేశారు.
అంతటితో ఆగకుండా సమయం సందర్భం అనేదే చూసుకోరు విజయసాయిరెడ్డి ట్వీట్స్ వర్షం కురిపించేస్తారు. అవి నిత్య నూతనంలా ప్రజలు భావిస్తుంటారు. ‘చిట్టి మాలోకం చిన్న మెదడు పూర్తిగా చితికిపోయినట్లుంది. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది బాబు హయాంలోనే. తొమ్మిదేళ్ల వరస కరువును ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. మేత దొరకక పశువులను కబేళాలకు అమ్ముకున్న దయనీయ దృశ్యాలను ప్రపంచమంతా చూసింది. రాజన్న రాకతోనే వ్యవసాయం పండగలా మారింది.’ అంటూ లోకేశ్ కి గట్టి కౌంటరే ఇచ్చారు.
అంతటితో ఆగకుండా ‘జగన్ గారి ఏడాది పాలన ‘ట్రైలర్’ కే కలుగులో దాక్కున్న ఎలుకలా హైదరాబాద్ లో గడుపుతున్న బాబు వచ్చే నాలుగేళ్లలో అసలు సినిమా చూసి ఏమవుతాడో? అనుభజ్ఞుడని గెలిపించిన ప్రజలను ఎంగిలి విస్తరాకుల్లా విసిరేసి, దోపిడీలు, స్కాములు చేస్తూ దొరికి పోయాడు. దొంగల ముఠా జైలుకెళ్లాల్సిందే.’ అంటూ మండిపడ్డారు. ఇంకా ‘ఇల్లులేని కుటుంబం ఆంధ్రాలో ఉండకూడదన్నదే జగన్ గారి ఆలోచన. పేదలకిచ్చే 30 లక్షల ఇళ్ల స్థలాల విషయంలో సంకుచిత ఆలోచనలు ఆపండి. ఒకసారి ఎక్కువ రేటుకు కొన్నారంటారు – మరోసారి ఊరు చివర అంటారు. అబద్ధపు ప్రచారాలతో విషబీజాలు నాటేందుకు ప్రయత్నిస్తున్నారు టీడీపీ పచ్చనేతలు’ అంటూ విజయసాయిరెడ్డి రెచ్చిపోయారు. మొత్తానికి విజయసాయిరెడ్డి ట్వీట్లు టీడీపీ కేడర్ ను బెంబేలెత్తిస్తన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.