కోవిడ్-19కు ప్లూ లక్షణాలు.. ఆరు విభాగాలుగా డివైడ్

-

కోవిడ్-19 వైరస్ ను ఇప్పుడు ఆరు రకాలుగా వర్గీకరించారు. బ్రిటన్ లోని కింగ్స్ కాలేజీ, లండన్ శాస్త్రవేత్తలు మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో కరోనా బారిన పడిన 1600 మంది రోగులకు బయటపడిన లక్షణాలను ఎప్పటికప్పుడు సేకరించి ప్రత్యేక అల్గారిథంతో విశ్లేషించి వర్గీకరించారు. అనంతరం అందరూ ఓ అభిప్రాయానికి వచ్చారు.

corona test
corona test

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృభిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ను నిర్మూలించడానికి వ్యాక్సిన్ ను, దాని లక్షణాలు కనుగొనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల లండన్ కు చెందిన శాస్త్రవేత్తలు కోవిడ్ రోగులను పరీక్షించి వారిలో ప్లూ లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. ఈ లక్షణాలను ఆరు వర్గాలుగా వర్గీకరించారు. జ్వరం, జీర్ణ కోశ సమస్యలు, తీవ్ర ఇన్ఫెక్షన్ తోపాటు గందరగోళం, తీవ్ర ఇన్ఫెక్షన్ తోపాటు కడుపు నొప్పి, శ్వాస సమస్య అనే ఆరు విభాగాలు విభజించారు బ్రిటిష్ శాస్త్రవేత్తలు.

Read more RELATED
Recommended to you

Latest news