కరోనా పరీక్షలు.. ప్రవైట్ ల్యాబులకు జగన్ సర్కార్ కీలక ఆదేశాలు.?

-

దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతున్నాయి. జగన్ సర్కార్ కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ కేసుల సంఖ్య మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా వైద్య పరీక్షలకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రైవేట్ ల్యాబ్ లో కరోనా వైద్య పరీక్షల నిర్వహణ పై కీలక నిర్ణయం తీసుకున్నది జగన్ సర్కార్. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

ఐసీఎంఆర్ నుంచి అనుమతి లభించిన ప్రైవేట్ ల్యాబ్ లోనే టెస్టులు జరపాలని… ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ లకు 750 రూపాయలకు మించి తీసుకోకూడదు అంటూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా విఆర్డిఎల్ పరీక్షకు పంపితే 2800 రూపాయలకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ప్రతి పరీక్షా కేంద్రంలో ఐసీఎంఆర్ లాగిన్ డేటాను తప్పకుండా నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా వైరస్ పరీక్షలకు అధికంగా వసూలు చేస్తున్నారు అన్న విమర్శలు వచ్చిన నేపథ్యంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news