ఆగస్టు 5న కేసీఆర్-జగన్ ల సమావేశం..! ఎందుకో తెలుసా..?

-

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల సీఎంలతో ఆగస్టు 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించనున్నారు. ఈ భేటీలో ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాలను వినియోగిస్తూ రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, వాటి డీపీఆర్‌లు, బోర్డుల పరిధి వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. 016 ఆగస్టులో సీఎం కేసీఆర్‌, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్‌ కమిటీ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.

కేంద్ర లేఖపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సుముఖతగా ఉన్నట్లు సమాచారం. 1.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 2. అపెక్స్‌ కౌన్సిల్‌ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం, 3. కృష్ణా, గోదావరి నదీ జలాలను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 4. కృష్ణా నదీ బోర్డు ప్రధాన కార్యాలయాన్నిఏపీకి తరలించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది. ఈ సందర్భంగా డీపీఆర్‌ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news