మోదీ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టిన చంద్రబాబు.!

-

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. “కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నాను. మన యువత ప్రపంచంతో పోటీ పడే విధంగా నూతన విద్యా విధానం సమూల మార్పులకు నాంది పలుకుతుంది. 5వ తరగతి వరకూ మాతృభాషలో విద్యా బోధన ఉండాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

కాగా, విద్యా వ్యవస్థను పర్యవేక్షించే మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరు మార్చడం, 10+2 విధానానికి స్వస్తి పలకడం, మూడేళ్లప్రాయంలోనే చిన్నారులను ప్రీస్కూల్ విద్యాను అందించేలా జాతీయ విద్యా విధానంలో మార్పులను తీసుకొచ్చింది. దీనిపై కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను ఆమోదించింది.

Read more RELATED
Recommended to you

Latest news