ఇక జగన్ తో సెల్ఫీ కష్టమే…

-

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కారణంగా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నారు. గాయం కారణంగా విరామం తీసుకున్న జగన్ త్వరలో ప్రజాసంకల్ప యాత్రను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన చుట్టూ మూడంచెల  భద్రత వలయాన్ని ఏర్పాటు చేస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ పాలరాజు తెలిపారు. దీంతో గతంలో పాదయాత్ర లో ఎవరు పడితే వారు కలుసుకుని సెల్ఫీలు దిగడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం వంటివి జరిగేవి ఇప్పుడు అలాంటివి కష్టమే.

ముందస్తుగా అనుమతి తీసుకున్న వారి నడవడికను పరిశీలించిన తర్వాతే జగన్ వద్దకు అనుమతిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. ఇలా అయితే ప్రజా సంకల్ప యాత్రలో ఇక నుంచి జగన్ ఆప్యాయతను సామాన్యులు మిస్ అవ్వక తప్పదేమో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news