ఆ మరణాలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే: నారా లోకేష్

-

జే ట్యాక్స్ వసూళ్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రకాశం జిల్లా కురిచేడు, పామూరులో శానిటైజర్ తాగి 13 ప‌ది మంది చ‌నిపోవ‌డం అత్యంత విషాద‌కరమ‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవి ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారు హ‌త్యలేన‌ని లోకేశ్ ఆరోపించారు. ప్రభుత్వ అస్తవ్యస్త మద్యం పాలసీ, విషం లాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. మ‌ద్య నిషేధం ముసుగులో ‘జే ట్యాక్స్’ వసూళ్ల కోసం విషం లాంటి బ్రాండ్లు 300 శాతం అధిక ధరలకు అమ్మడం జ‌గ‌న్ ‌రెడ్డికే చెల్లింది. మ‌ద్యానికి బానిసైన నిరుపేద‌లు ఇలా సారా, శానిటైజర్లు తాగి మృత్యువాత ప‌డుతున్నారు. ఈ మరణాలు ముమ్మూటికీ జ‌గ‌న్‌రెడ్డి సర్కారు హత్యలే. శానిటైజ‌ర్ తాగి కురిచేడు, పామూరులో చ‌నిపోయిన ఒక్కొక్కరి కుటుంబానికి 50 ల‌క్షల రూపాయలు ప‌రిహారం చెల్లించాలి. వైఎస్ఆర్సిపి లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అని లోకేష్ అన్నారు.

lokesh
lokesh

కురిచేడు ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నకిలీ మద్యం తాగే వారు మృతి చెంది ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యం, సారా ఏరులై పారుతోందని.. అధికార పక్ష నేతల కనుసన్నల్లో ఈ దందా సాగుతుందని యరపతినేని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news