ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు రికార్డుస్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య నమోదు అవుతున్న విషయం తెలిసిందే. కేవలం సామాన్య ప్రజలే కాదు ఎంతో మంది ప్రజాప్రతినిధులు సైతం కరోనా వైరస్ బారినపడి ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా కరోనా వైరస్ బారినపడి మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి చెందారు. మాజీ మంత్రి మాణిక్యాలరావు(60) కరోనా వైరస్ బారినపడి మృతి చెందడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
గత ప్రభుత్వ హయాంలో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. బిజెపి పార్టీ తరఫున తాడేపల్లిగూడెం నుండి విజయం సాధించారు. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న మాణిక్యాలరావు విజయవాడ హెల్ప్ ఆస్పత్రిలో చేరారు. పది రోజుల నుంచి వెంటిలేషన్ లో ఉన్న మాణిక్యాలరావు కాసేపటి క్రితమే కన్నుమూశారు. ఇక మాణిక్యాల రావు మృతి పట్ల ఎంతోమంది రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.