విశాఖ ఘటన పై సీఎం జగన్ ఆరా..!

విశాఖను వరుస ప్రమాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన… ఆ తర్వాత పలు అగ్నిప్రమాదాలు… ఇటీవలే విశాఖకు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం. విశాఖ వాసులను వరుస ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

jagan

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సహా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మరికొంత మంది అధికారులను ఈ ఘటనపై ఆరాతీసి పలు వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. షిప్ యార్డ్ లో ప్రమాదం జరగడం బాధాకరం అని… క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు.