సినీ పరిశ్రమలో ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజు రోజుకి ఎక్కడో ఒక చోట ఎవరో ఒక నటుడు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కాస్త కలవర పెడుతున్నాయి. నిన్న ఒక నటుడు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నెల రెండున జరిగిన ఒక నటి మరణంకి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలో భోజ్‌పురి నటి అనుపమ పాథక్ ఆగస్టు 2 న తన దాహిసర్ ఈస్ట్ ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆమె సూసైడ్ నోట్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ముందు ప్రాధమిక విచారణలో భాగంగా ఇది ప్రమాదవ శాత్తు జరిగిన మరణంగా పోలీసులు కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఈ కేసుని ఐపిసి సెక్షన్ 306 కి మార్చారు. అంటే ఆత్మహత్య చేసుకున్న కేసుగా దీన్ని నమోదు చేసారు. కాశీమిరా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
Maharashtra: Bhojpuri actress Anupama Pathak died by suicide at her Dahisar East home on Aug 2. Suicide note recovered. Accidental Death Report, registered initially, converted into FIR under IPC Sec 306 (Abetment of suicide) against a person & a company. Kashimira Police probing
— ANI (@ANI) August 7, 2020