కొన్ని రోజుల క్రితంవరకూ.. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ రాజముద్ర వేయకముందువరకూ.. ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూనే హాట్ టాపిక్. అమరావతి వ్యవహారం తెరపైకి ఇంత సీరియస్ గా రానంతవరకూ అటు టీడీపీకి, వారి అనుకూల మీడియాకు నిమ్మగడ్డ వ్యవహారమే ఫుల్ మీల్స్!! ఈ క్రమంలో పోరాడి దక్కించుకున్నారో లేక జగన్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా పొందారో తెలియదు కానీ… నిమ్మగడ్డ తిరిగి తన కుర్చీ ఎక్కారు! ఈ క్రమంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు!
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉంటే.. తమకు వ్యక్తగతంగా లాభం అని టీడీపీ నేతలు భావించారో లేక నిమ్మగడ్డ ప్రవర్తన వల్ల జనం అలా అనే నమ్మారో ఏమో కానీ… ఒకానొక సమయంలో రమేష్ కుమార్ ను టీడీపీ నేతల లిస్ట్ లో కలిపేశారు కొందరు ప్రజానికం! ఈ క్రమంలో తాజాగ కుర్చీ ఎక్కిన నిమ్మగడ్డ కు పనిలేకుండా చేశారు జగన్! రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్ లలో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో… ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయనే మాటలు వినిపిస్తున్నాయి!
అవును… ఏపీలోని 108 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో… 2021 మార్చి నెలలో నిమ్మగడ్డ పదవీకాలం పూర్తయిన తర్వాత మాత్రమే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు! దానికి కారణం… నాడు నిమ్మగడ్డ ఏ “కారణం” చెప్పి ఎన్నికలను వాయిదా వేశారో… ప్రభుత్వం నుంచి కూడా అదే సమాధానం వచ్చే అవకాశాలున్నాయి! మరి ఇప్పుడు నిమ్మగడ్డకు ఊసుపోయేదెలా అంటూ ఆయన అభిమానులు ఫీలవుతున్నారు!!