ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జంపింగ్ లు కాస్త హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో బలమైన నేతలుగా ఉన్న వారిని అధికార పార్టీ టార్గెట్ చేస్తూ వైసీపీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపధ్యంలోనే పార్టీ కీలక నేత గంటా శ్రీనివాసరావు మీద దృష్టి పెట్టగా ఆయన పార్టీలోకి రావడానికి రెడీ అయ్యారు. అయితే ఇప్పుడు ఆయన విషయంలో మంత్రి అవంతి శ్రీనివాస్ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వస్తున్నాయి.
ఆయన పార్టీ మారడానికి రెడీ అయితే అవంతి మాత్రం అసలు వద్దు అని చెప్తున్నారు. నిన్న ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో వైసీపీ నేతలు ధర్నాలు చేసారు. ఇది సిఎం జగన్ కు కాస్త చికాకుగా మారింది అంటున్నారు. పలు సందర్భాల్లో మీడియా ముందు అవంతి ఏదోక వ్యాఖ్య చేస్తున్నారు. కేసుల కోసమే పార్టీ మారుతున్నారని ఆయన విమర్శించడంతో వైసీపీలోకి వస్తే కేసులు ఉండవా అనే భావన జనాల్లో కలుగుతుంది అని జగన్ లో కాస్త అసహనం ఉందట.