యాత్రకు ఏడాది…జగన్ ట్వీట్

-

ఏడాది పాటు ప్రజల మధ్యలోనే గడిపిన నేతగా రికార్డ్

తెదేపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలోనే తెలుసుకునేందుకు, వైసీపీ నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను వినేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన   ప్రజాసంకల్ప యాత్రకు నేటికి ఏడాది పూర్తి చేసుకుంది. నవంబరు 6, 2017న ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక స్థలం నుంచి మొదలైన యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాను దాటుకుంటూ…క్షేత్ర స్థాయిలోని  ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతోంది.

ఈ క్రమంలో కొద్ది రోజుల్లోనే యాత్ర ముగుస్తుంది అనుకునే లోపే జగన్ పై విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి జరగడం కలకలం రేపింది. గాయం పూర్తి స్థాయిలో మానిన తర్వాత త్వరలోనే యాత్రను ప్రారంభిస్తానంటూ జగన్ పేర్కొన్నారు.  ఏడాది పాటు రాష్ట్రం మొత్తం తిరుగుతూ ప్రజల మధ్యలో గడిపిన ప్రజా నాయకుడిగా వైసీపీ అధినేత రికార్డు సాధించారు.    ప్రజా సంకల్ప యాత్ర ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

యాత్ర విశేషాలు…

ఇప్పటి వరకు 294 రోజుల్లో 11 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల మీదుగా కొనసాగింది.

1739 గ్రామాలు, 205 మండలాలు, 47 పురపాలక సంఘాలు, 8 కార్పోరేషన్ల ప్రజలతో ప్రత్యక్షంగా ముచ్చటించారు.

113 బహిరంగసభలు, 42 చోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news