కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా లేకపోతే వెంటనే ఆ పదవికి ఎన్నికలను నిర్వహించాలని ఆ పార్టీ నేత, ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసుల్లో ఓ విశ్వసనీయమైన ప్రతిపక్షంగా ఎదగడం ఏంతో అవసరమని ఆయన అన్నారు. ఇంతటి క్లిష్ట సమయంలోనూ పార్టీకి పూర్తి కాలపు అధ్యక్షులు లేకపోవడం ఇబ్బందని, వెంటనే రాహుల్ తన నిర్ణయాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని శశి సూచించారు.
ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ పగ్గాలను ఇబ్బంది పడుతూనే మోయడం సరికాదని, రాహుల్ ముందుకు వస్తే మంచిదని శశిధరూర్ సూచించారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ సహా దేశ రాజకీయాల్లో శశిధరూర్ వ్యాఖ్యలు సంచలనం అవుతున్నాయి. గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకున్న రాహుల్ గాంధీ.. ఘోర పరాజయం నేపథ్యంలో దానికి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.