కేరళకు చెందిన ఓ నిండు గర్భవతి పైగా కరోనా పేషెంట్. ఓ వైపు కరోనా చికిత్స పొందుతూనే, పుట్టబోయే బిడ్డ గురించి తగిన జాగ్రత్తలు పడుతోంది. ఇంతలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. అయిన కరోనా పేషెంట్ కు పురిటి నొప్పులు వచ్చాయి. సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్స్ లో ఎక్కించుకుని ఆసుపత్రికి బయల్దేరారు.
Thiruvananthapuram: 38-year-old woman suffering from #COVID19 gives birth to a baby boy in an ambulance on her way to hospital with the medical support of ambulance staff. #Kerala Health Minister KK Shailaja congratulated ambulance staff who volunteered to carry out the delivery pic.twitter.com/glrxl3cKCp
— ANI (@ANI) August 13, 2020
అయితే ఆమె ప్రయాణంలో అంబులెన్స్ లోనే ప్రసవించింది. ఆమె ప్రసవం ఆరోగ్యంగా జరగడానికి అంబులెన్స్ సిబ్బందే ఆమెకు సపర్యలు చేశారు. దీంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ విషయమై కేరళ ఆరోగ్యశాఖ మంత్రి అంబులెన్స్ సిబ్బందిని నిజమైన మానవతావాదులని అభినందించారు.