‘ఆహా’లో న‌టించేందుకు రెఢీ అంటున్న చిరు..!

-

ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో న‌టించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్‌ తెలిపారు. ఆహా ఓటీటీ యాప్‌లో విడుద‌ల‌య్యే సినిమాల వివ‌రాల‌ను తాజాగా అర‌వింద్‌ వెల్ల‌డించారు. ఈ సందర్భంగా పెద్ద హీరోలు కూడా ఓటీటీల్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని ఆయ‌న అన్నారు. ఫిబ్రవరి 8న ప్రారంభించిన ఆహా యాప్ కు మంచి స్పందన వస్తోంది.

ఇప్పటివరకు దాదాపు 40 లక్షల డౌన్ లోడ్లు అయ్యాయని. రానున్న రోజుల్లో థియేటర్లు రీ ఓపెన్ చేసినా ఓటీటీలని పక్కన పెట్టేస్తారనుకోవడం లేదు’ అని అల్లు అరవింద్ సమాధానం ఇచ్చారు. అలాగే 42 షోలు రాబోయే రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయ‌ని.. ఇందుకోసం చిరంజీవితో కూడా ఆహా కోసం సంప్ర‌దింపులు జరిపామని, క‌థ న‌చ్చితే న‌టించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నార‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news