సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం దర్గాపల్లివాగులో ఇన్నోవా వాహనం కొట్టుకుపోయిన ఘటనలో ముగ్గురు బయట పడగా ఒక వ్యక్తి మాత్రం కారుతో సహా గల్లంతు అయ్యారు. వివరాల్లోకి వెళ్తే రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు జంగపల్లి శ్రీనివాస్, నిన్న రాత్రి ముగ్గురు స్నేహితులతో కలిసి వాహనంలో వెళ్తుండగా సిద్దిపేట జిల్లా దర్గాపల్లి వద్ద వాగులో పడిపోయారు.
స్థానికులు వెంటనే గమనించి ముగ్గురిని బయటకు తీయగా కారు తో పాటు శ్రీనివాస్ గల్లంతయ్యాడు. దీంతో గజ ఈతగాళ్ళు ఆయన కోసం గాలిస్తున్నారు. విషయం తెల్సుకున్న మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉదయాన్నే సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలనీ ఆదేశించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సిద్ధిపేట ఆర్డీఓ సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.