ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ప్రతిరోజూ దాదాపు 10 వేల కొత్త కేసులు నమోదవుతున్న క్రమంలో సిరో సర్వైలెన్స్ నిర్వహించిన సర్వే సంచలన నిజాలు తెలిపింది. విజయవాడలో 43.81% మంది కరోనా ప్రభావానికి గురయినట్లు ఈ సర్వే తెలిపింది. ఈ ప్రాంతంలో మొత్తం 40.51% మందికి కరోనా వచ్చి పోయి ఉంటుందని తేల్చి చెప్పింది. వీరిలో చాలా మందికి లక్షణాలు లేవు కానీ, రక్త నమూనాలు పరీక్షిస్తే శరీరంలో యాంటీబాడీలు ఉన్నట్లు తెలిపారు.
సర్వే ప్రకారం.. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41% మందికి వైరస్ వచ్చి వెళ్ళినట్టు. అలాగే విజయవాడ అర్బన్‌లో 933 మందిలో 378మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. కాగా, ఇప్పటికే కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9%మందికి కరోనా వచ్చి పోయి ఉంటుందని సిరో సర్వైలెన్స్ నిర్వహించిన సర్వే తెలిపింది.