చెత్త ట్రాక్టర్​లో కరోనా యోధుల తరలింపు.. కార్మికుల ఆందోళన

-

సిద్దిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ పురపాలక సంఘంలో పని చేస్తున్న 9 మంది పారిశుద్ధ్య కార్మికులకు కరోనా సోకింది. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం అధికారులు బాధితులను మున్సిపాలిటీకి చెందిన చెత్త ట్రాక్టర్​లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తోటి కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మున్సిపాలటీ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.కార్మికులకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి సంఘీభావం తెలిపాడు.

అధికారుల తీరును తప్పుబట్టారు. ఘటనా స్థలికి చేరుకున్న కమిషనర్​ కార్మికులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫలితంగా కార్మికులు ఆందోళన విరమించారు. మొదటిలో కరోనా రోగులకు ప్రాణాలకు తెగించి వైద్యం అందజేస్తున్న వైద్యులపై దాడులు కూడా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో పోలీస్ శాఖ, వైద్య శాఖ, పారిశుద్ధ్య సిబ్బందికి వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కానీ అది కేవలం ఒక నెల కు మాత్రమే పరిమితి అవ్వడం అందరినీ కలిచివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news