వామ్మో.. అంత పెద్ద కింగ్‌కోబ్రాను ఎలా పట్టుకున్నాడో చూడండి..!

-

young man catches big cobra video goes viral

వీడు నిజంగా మనిషి కాదు. ఈ వీడియో చూసి మీరు కూడా అదే చెబుతారు. అసలు పామును చూస్తేనే దడుసుకుంటాం. పారిపోతాం. కానీ.. ఈ వ్యక్తి మాత్రం దాదాపు పదడుగులున్న పెద్ద కింగ్‌కోబ్రాను ఉత్త చేతులతో పట్టుకొని శెభాష్ అనిపించుకున్నాడు. భారీ కొండచిలువ ఆకారంలో ఉన్న నాగరాజు బుసలు కొడుతూ మనోడిని వైపు దూసుకొస్తున్నా ఏమాత్రం బెనకకుండా ఆ పామును పట్టుకున్న తీరును చూసి నెటిజన్లు మనోడిని తెగ మెచ్చుకుంటున్నారు. తెలుసు కదా.. కింగ్‌కోబ్రా కేవలం నాగుపాములను మాత్రమే ఆహారంగా తీసుకుంటుంది. దాని ఒక్క కాటుకు వెలువడే విషం ఇరవైమంది మనుషులను అవలీలగా చంపేస్తుంది. దాని కాటు తింటే 5 నిమిషాల్లోపే పరలోకానికి ప్రయాణం కట్టాల్సిందే. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. మనోడు పామును పట్టుకున్న వీడియో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్ల భాషను బట్టి చూస్తే.. అది కేరళలో జరిగిన ఘటనగా భావిస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news