మన దేశంలో ఉద్యోగం రావాలి అంటే లంచం ఇవ్వాలి. అప్పో సొప్పో చేసి లంచాలు ఇస్తూ ఉంటారు. కాని ఓ వ్యక్తి మాత్రం దొంగతనం చేసి లంచం ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదురైలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తన ఇంట్లోకి ప్రవేశించి తన సోదరుడికి చెందిన రూ .4,50,000 నగదును దోచుకున్నారని రాయ పోలీస్ స్టేషన్ లో దిలీప్ కుమార్ సింగ్ కేసు నమోదు చేసాడు.
విచారణలో దిలీప్ అనుమానంగా ఉండటంతో అతనిని ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు. ఆ డబ్బు తాను తన ఫ్రెండ్ కలిసి దొంగతనం చేసామని, ఉద్యోగం పొందడానికి కొంతమంది అధికారులకు లంచం ఇవ్వడానికి ఈ మొత్తం అవసరమని సింగ్ పోలీసులకు చెప్పాడు. దొంగిలించిన నగదులో రూ .1,41,900 స్వాధీనం చేసుకున్నామని, నిందితులు ఇద్దరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు అధికారులు తెలిపారు.