డ్రగ్స్ కేసు : యూరిన్ శాంపిల్‌లో నీటిని మిక్స్ చేసిన సినీ నటి..!

-

సినీ ఇండ‌స్ట్రీలో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతుంది. తాజాగా క‌న్నడ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల వాడకానికి సంబందించిన స‌మాచారాన్ని కొందరు సీసీబీకి అందించారు. ఈ నేపథ్యంలో నటి రాగిణిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే డ్ర‌గ్స్ ప‌రీక్ష కోసం రాగిణిని శాంపిల్ అడిగితే.. మూత్రంలో నీటిని క‌లిపి వైద్యులకు అందజేసినట్లు తెలిసింది. రాగిణి ఇచ్చిన శాంపిల్ కలుషితమైందని గుర్తించిన వైద్యులు సీసీబీ అధికారికి స‌మాచారం ఇచ్చారు. ఆమె మోసం గురించి అప్రమత్తమైన సీసీబీ అధికారి రాగిణిని మళ్లీ ప‌రీక్ష కోసం శాంపిల్ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇకపోతే డ్రగ్స్ కేసు విషయంలో రాగిణి సన్నిహితుడు రవిశంకర్‌ను కూడా సీసీబీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

అలాగే ఇదే కేసులో నటి అనికాను ఎన్ సీబీ అధికారులు ఇప్పటికే అరెస్టు చేసి విచారణ చేశారు. ఈ విచారణలో దాదాపు 15 మంది టాప్ యాక్టర్లకు, డైరెక్టర్లకు, మ్యూజిక్ డైరెక్టర్లకు డ్రగ్ సప్లయిర్లతో సంబంధాలున్నాయనే విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. అటు బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతుంది. ఈ వ్యవహారంతో టాలీవుడ్ కి చెందిన వారికి కూడా సంబంధాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news