ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ ప్రారంభానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. శనివారం ముంబై, చెన్నై జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరగనుంది. దీంతో ఇరు జట్లకు చెందిన ఫ్యాన్స్ మాత్రమే కాదు.. యావత్ ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా చెన్నైతో మ్యాచ్ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెపెన్ట్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.
చెన్నై సూపర్ కింగ్స్ చాలా అద్భుతమైన జట్టు. చెన్నై టీంతో ఆడడాన్ని నేను బాగా ఎంజాయ్ చేస్తా. కానీ మైదానంలో తలపడితే అన్ని జట్లలాగే చెన్నైని భావించాలి. అలా చేయకపోతే చెన్నైని ఢీకొట్టలేం. ఇతర అన్ని జట్లలాగే చెన్నై కూడా మాకు ఒక సాధారణ జట్టు అని అనుకుంటేనే మ్యాచ్‌లో ముందుకు సాగగలం.. అని రోహిత్ శర్మ అన్నాడు. ఈ మేరకు ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ మాట్లాడిన ఓ వీడియోను తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
A fresh #Dream11IPL season ➡️ A brand new Captain's Corner!
Paltan, this time Ro is taking questions from you 🤩💙#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/W3fJaQ4704
— Mumbai Indians (@mipaltan) September 18, 2020
ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. ముంబై, చెన్నై టీంలకు ఫ్యాన్స్ అధికంగా ఉన్నారు. చాలా మంది ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్‌ను చూసేందుకు ఇష్టపడతారు. చెన్నైతో ఆడిన ప్రతిసారీ మేం గెలుస్తామో, లేదో అనుకుంటాం. గెలవాలని కోరుకుంటాం. ఫ్యాన్స్ మా రెండు జట్లు తలపడితే చాలా ఆసక్తికరంగా చూస్తారు.. అని అన్నాడు.
ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనె మాట్లాడుతూ.. చెన్నై లాంటి టీంను ఢీకొట్టాలంటే మెరుగైన ప్రదర్శన చేయాలి. ముంబై ఇండియన్స్ ప్లేయర్లు తమ శక్తివంచన లేకుండా చెన్నై టీంను ఎదుర్కొంటారని ఆశిస్తున్నా.. అని అన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 28 సార్లు తలపడ్డాయి. ముంబై 17 మ్యాచ్‌ల్లో గెలిచింది. చెన్నై 11 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఈ లెక్కలు చూస్తే ముంబై ఇండియన్స్ కే ఎక్కువ ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తుంది. అయినప్పటికీ చెన్నై టీంను కూడా తక్కువ అంచనా వేయలేం. మరి ఈ రోజు మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారో చూడాలి.