ఎవరితో అయినా పెట్టుకోండి రేవంత్ తో కాదు ?

-

రేవంత్ రెడ్డి. ఈ పేరు చెబితే చాలు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ కు ముచ్చెమటలు పడతాయి. తెలంగాణలో కాంగ్రెస్ బలం అంతంత మాత్రంగానే ఉన్నా, పేరుకి చెప్పుకోవడానికి ప్రధాన ప్రతిపక్షం అయినా, ఆ పార్టీ నాయకులు టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేసే విషయంలో అంత సీరియస్ గా దృష్టిపెట్టారు. కేవలం ఏదో కొన్ని అంశాలపై దృష్టి పెట్టి హడావుడి చేసి సైలెంట్ అయిపోతారు. ఎక్కువగా కాంగ్రెస్ నాయకులు వారిలో వారే ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకునేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తారు. కానీ కేసీఆర్, కేటీఆర్ రాజకీయంగానూ, వ్యక్తిగతంగాను ఇరుకున పెట్టే విషయంలో రేవంత్ రెడ్డి చూపించే దూకుడు ఆ ఇద్దరు నేతలకు ఆందోళన కలిగిస్తుంది.

తండ్రి కొడుకులను ఇబ్బంది పెట్టే విషయంలో రేవంత్ ఎక్కడా వెనకడుగు వేయరు. సూటిగానే ప్రశ్నిస్తూ, వారి వ్యవహారాన్ని ప్రజల ముందు పెడుతూ ఉంటారు. రోజుకో రకంగా వారిపై విమర్శలు చేస్తూ ఉంటారు రేవంత్. ఇటీవల నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పై కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క చేసిన సవాలుకు టిఆర్ఎస్ స్పందించింది. స్వయంగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భట్టి విక్రమార్క ఇంటికి వెళ్లి ఆయనను స్వయంగా తన కార్ లో తీసుకెళ్లి మరి డబల్ బెడ్ రూమ్ ఇల్లు చూపించారు. కానీ  ఇటువంటి ఎన్నో వ్యవహారాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఎన్నో విమర్శలు, చాలెంజ్ లు చేసినా, పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తున్నారు.

రేవంత్ సవాళ్లకు స్పందిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కెసిఆర్, కేటీఆర్ కు బాగా తెలుసు. అందుకే వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకొనట్టుగానే వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించడంలోనూ, కరోనా కట్టడి చేసే విషయంలో గాని విఫలమయ్యారని, ఇంకా అనేక ప్రజా సమస్యలపై రేవంత్ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా స్పందించినట్టు గానే కెసిఆర్, కేటీఆర్ వ్యవహరిస్తూ ఉంటారు. ఇప్పటికే టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులను గుర్తించి, తమ దారికి తెచ్చుకునే ప్రయత్నంలో రేవంత్ సక్సెస్ అవుతున్నట్టు కనిపిస్తున్నారు. శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ ప్రస్తుతం రేవంత్ కు మద్దతుగా మాట్లాడటం, కాంగ్రెస్  ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరుకావడం వంటివి చేస్తూ, టిఆర్ఎస్ కు చికాకు తెప్పిస్తున్నారు.

వచ్చే ఎన్నికల నాటికి టిఆర్ఎస్ లోని అసంతృప్తులు అందరినీ తన వర్గంలో చేర్చుకుని మరింతగా బలపడాలనే విధంగా రేవంత్ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు. రేవంత్ వంటి రాజకీయ ఉద్దండులను తట్టుకుని నిలవడం తెలంగాణ రాజకీయాలను కాచి వడపోసిన కేసీఆర్ వంటి సీనియర్లకు సాధ్యం కాదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం దుబ్బాక, గ్రేటర్ ఎన్నిలల్లో కనుక టీఆర్ఎస్ కు అంతంతమాత్రంగా ఫలితాలు వచ్చాయంటే కనుక  రేవంత్ ను ఆపడం ఇక సాధ్యమే కాదు అనే విషయమూ కెసిఆర్, కేటీఆర్ కూ బాగా తెలుసు.

-Surya

Read more RELATED
Recommended to you

Latest news