బ్రేకింగ్: తబ్లిఘీ జమాత్ వల్లే కరోనా వ్యాప్తి: కేంద్ర హోం శాఖ

-

నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన తబ్లిఘి జమాత్ సమావేశం “చాలా మందికి” కరోనా వైరస్ వ్యాపించడానికి దారితీసిందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. 233 తబ్లిఘీ జమాత్ సభ్యులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని, మార్చి 29 నుండి 2,361 మందిని సంస్థ ప్రధాన కార్యాలయం నుండి తరలించారని ఒక లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి రాజ్యసభలో తెలిపారు.

అయితే, జమాత్ చీఫ్ మౌలానా మొహద్ సాద్‌కు సంబంధించి దర్యాప్తు జరుగుతోందని ఆయన తెలిపారు. ఢిల్లీ పోలీసుల నివేదిక ప్రకారం కరోనా వైరస్ వ్యాప్తికి అనుగుణంగా వివిధ అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలు మరియు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఒక పెద్ద సమావేశాన్ని ఒక హాల్ లో సుదీర్ఘ కాలం నిర్వహించడం, సామాజిక దూరం లేకుండా మాస్క్ లు లేకుండా శానిటైజర్ లు లేకుండా నిర్వహించారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news