లోటస్ పాండ్ లోని ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు అధికారులు. ఆంద్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది బజరంగ్ దళ్. జగన్ సీఎం అయ్యాక ఏపీలో దేవాలయాలపై దాడులు.. మత మార్పిడులు పెరిగాయని బజరంగ్ దళ్ ఆరోపిస్తుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు పోలీసులు.
దాదాపు 300 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేసారు. సీఎం ఇంటికి 200 మీటర్ల దూరంలోనే బారీకేడ్స్ ఏర్పాటు చేసారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం.. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాజధాని కావడంతో పోలీసుల అలెర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా పరిస్థితిని సమీక్షాస్తోన్న ఉన్నతాధికారులు పోలీసులకు పలు సూచనలు చేస్తున్నారు. కాగా ఏపీలో గత కొన్ని రోజులుగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.