బీజేపీని మాకు నచ్చినప్పుడు ప్రేమిస్తాం.. మాకు అవసరం తీరాకా ద్వేషిస్తాం.. రాష్ట్రానికివస్తే రాళ్లుకూడా వేయిస్తాం.. ఎక్కువమాట్లాడితే ఏపీలో బీజేపీ నేతల విమానాన్ని కూడా దిగనివ్వం..! బీజేపీ విషయంలో టీడీపీ వాదన ఇలా ఉంది!! ఇప్పటికే బీజేపీతో కలవడం చారిత్రక తప్పిందం అని.. ఆ తప్పిదాన్ని పునరావృతం చేయగల నేర్పరి అయిన చంద్రబాబు.. వైకాపా – బీజేపీ కాస్త క్లోజ్ గా ఉన్నట్లు కనిపిస్తే మాత్రం నరాలు తెంపేసుకుంటున్నారు.. అందుకు తాజా ఉదాహరణ ఒకటి హస్తిన వేధికగా జరిగింది!
జగన్ హస్తిన యాత్ర సక్సెస్ అయ్యిందని వైకాపా నేతలు చెబుతున్నారు. ఆ మాటలకు మరింత బలాన్ని చేకూరుస్తూ… ప్రధాని మోదీ సైతం జగన్ ను ఆకాశానికెత్తేశారు.. పాలన అద్భుతః అన్నారు. సాక్షాత్తూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రే ఏపీలో వ్యవసాయరంగానికి ఉచిత విద్యుత్ విషయంలో సీఎం జగన్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. అమిత్ షా కూడా జగన్ తో సానుకూలంగా చర్చలు జరిపారు. దీంతో టీడీపీ నేతలకు నరాలు తెగిపోతున్నాయి.. బీపీతో బిగుసుకుపోతున్నారు.. పల్లు పటపటా కొరికేస్తున్నారు. లాజిక్కులు, వాస్తవాలు జాంతా నై… మైకు దొరికింది ఏదో ఒక బురదజల్లేద్దాం అన్నట్లుగా ఫిక్సయిపోయారు!
దీనికి తోడు… పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అవినీతిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు వైసీపీ ఎంపీలు. దీంతో టీడీపీ నేతలకు కడుపు మంట మరింత పెరిగింది. దాన్ని చల్లార్చుకోడానికన్నట్లుగా ప్రెస్ మీట్ పెట్టి నిందలు వేశారు. అమిత్ షా కు జగన్ కు మధ్య గొడవ జరిగిందని.. రహస్య మంతనాలు ఏమిటని జగన్ ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాయి. మరి ఆ మంతనాల్లో వరుసగా రెండు సార్లు పాల్గొన్న బీజేపీ నేతలను, అమిత్ షా ను ఏమీ అనరెందుకో?
-CH Raja