“రెడ్డి” సామాజికవర్గంపై “ట్రిపుల్ ఆర్” రీసెర్చ్ ఇది!

-

గతకొన్ని రోజులుగా రాజశేఖర్ “రెడ్డి” అంటే తనకు చాలా ఇష్టం అంటూనే ఆయన కుమారుడు జగన్ మోహన్ “రెడ్డి”పై అంతెత్తున లేస్తున్నారు “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ” రఘురామకృష్ణంరాజు! తాజాగా మైకందుకున్న ఆయన… పేర్ల చివరిలో వచ్చే “రెడ్డి” అనే విషయాలపై రీసెర్చ్ చేసినటుగా.. అది ప్రత్యేకంగా ఒక సామాజికవర్గం కాదని చెప్పుకొస్తున్నారు!

అవును… తనకు రెడ్లు అంటే చాలా ఇష్టం అని మొదలుపెట్టిన రఘురామకృష్ణంరాజు… పేర్ల చివరిలో వచ్చే “రెడ్డి” అనేది గ్రామాల్లో ఒక పెద్దగా గుర్తించి గౌరవసూచకంగా ఇచ్చే బిరుదే తప్ప ప్రత్యేకంగా “రెడ్డి కులం” అంటూ ఏమీలేదని చెప్పుకొస్తున్నారు ఆర్.ఆర్.ఆర్. “రెడ్డి” సామాజికవర్గం అసలు సామాజికవర్గమే కాదంటూ ఆర్.ఆర్.ఆర్. ఇస్తున్న వివరణ ఇది!

గ్రామాల్లో “మునసబు”లుగా పని చేసేవారికి “రెడ్డి” అనే ఉండేది.. తెలంగాణలో “పటేల్‌, పట్వారీ”లుగా పనిచేసిన వారికి పేరు చివర “రెడ్డి” అనేది హోదాగా ఉండేది.. గ్రామంలో “పన్నులు వసూలు చేసే పెద్ద మనిషి”గా ఉండే రఘువీరారెడ్డి “బీసీ” అయినప్పటికీ ఆయన పేరులో “రెడ్డి” ఉంది.. హీరో వెంకటేశ్‌ మామగారు “కమ్మ” కులానికి చెందినా ఆయన పేరులో “రెడ్డి” ఉంటుంది.

కాబట్టి… “రెడ్డి” పేరుతో ప్రత్యేకంగా కులం ఎక్కడా లేదు. “రెడ్డి” కులంగా చెప్పుకొంటున్న వారి కులం నిజానికి “కాపు”.. అని చెప్పుకొచ్చారు రఘురామకృష్ణంరాజు!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news