వైసీపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన మోడీ…?

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన కి ఎందుకు వెళ్తున్నారు అనేదానిపై గత కొన్ని రోజులుగా చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన లో ప్రధానంగా ప్రస్తావించ అంశాలేంటి అనే దానిపై రాజకీయవర్గాల్లో కూడా ఒక రకమైన కనపడని ఆసక్తి నెలకొంది. వైసిపి ఎన్డీఏలో చేరవచ్చు అనే ఊహాగానాలు కొన్ని ప్రముఖ ఛానల్స్ లో వస్తున్న సంగతి విధితమే. అయితే దీనికి సంబంధించి వైసీపీ గాని బిజెపి గాని ఎలాంటి స్పష్టత కూడా ఇప్పటివరకు బయట పెట్టలేదు. అయితే రాష్ట్రంలో వైసీపీ బీజేపీ మాత్రం పరోక్షంగా స్నేహం చేస్తూ వస్తున్నాయి.

బీజేపీతో దోస్తీ కోసం సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాష్ట్రంలో బీజేపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా సరే అందుకు తగిన విధంగా వైసీపీ నుంచి కూడా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. అయితే ఇప్పుడు సీఎం జగన్ 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. మొదట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తారని భావించినా అది సాధ్యం కాలేదు. కానీ ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు జగన్. ఈ సందర్భంగా వైసీపీ.. ఎన్డియేలో చేరడం పై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.

అందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అన్నారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ తో జగన్ భేటీ కావడం తో వీరిద్దరి మధ్య ఎన్డియేలో చేరిక గురించే ప్రధానంగా చర్చ జరిగిందని వైసిపి కి రెండు కేబినేట్ బెర్త్ లు ఇవ్వడానికే ప్రధాని నరేంద్ర మోడీ అంగీకారం తెలిపారని, ఒక సహాయ మంత్రి పదవి కూడా ఇవ్వటానికి ప్రధాని ఒప్పుకున్నారని, సీఎం జగన్ కూడా పలు డిమాండ్లు ప్రధాని ముందు ఉంచారని మీడియా వర్గాలు అంటున్నాయి. వైసిపి ఎలాంటి స్పందన కూడా చెప్పలేదు. కేంద్రంతో స్నేహం చేస్తే మాత్రం రాష్ట్రంలో టీడీపీకి చెక్ పెట్టవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. అటు కేంద్రంతో కూడా మంచి సంబంధాలు ఉంటే… ఈ క్లిష్ట సమయంలో కలిసి వస్తుంది అనే భావన జగన్ లో ఉందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news