మోడీ క్రియేట్ చేసిన రికార్డు.. 20ఏళ్ళుగా ప్రభుత్వంలోనే.

-

20ఏళ్ళుగా ప్రభుత్వంలోనే ఉన్న మోడీ సరికొత్త రికార్డుని క్రియేట్ చేసాడు. 2001అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మోడీ, ఆ తర్వాత వరుసగా మరో రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళిన మోడీ, బీజేపీని బలోపేతం చేసారు. ఫలితం 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మోడీ భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసారు.

ఆ తర్వాత 2019లో మరో మారు ప్రధాని పీఠాన్ని అధిష్టించారు. అంటే మొత్తం 20ఏళ్ళుగా మోడీ ప్రభుత్వంలోనే ఉన్నారు. రాజకీయాల్లో ఒక నాయకుడు 20ఏళ్ళుగా ప్రభుత్వంలోనే ఉండడం రికార్డుగా నిలిచింది. బీజేపీ అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలున్న టైమ్ లో ఇండియా మొత్తంలో బీజేపీ గాలి ప్రసరించేలా చేసిన వారిలో మోడీ ఒకరు. కాంగ్రెస్ పదేళ్ల పాలనని పక్కకి నెట్టి బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మోడీదే. అందుకే దేశవ్యాప్తంగా ప్రజలందరూ మోడీకి రెండవ సారి ప్రధాని పీఠాన్ని ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news