ఇక రైలు ప్రారంభం అయ్యేందుకు 5 నిమిషాల ముందు వ‌రకు రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల‌ను కొన‌వ‌చ్చు..!

-

భార‌తీయ రైల్వే దేశంలోని రైల్వే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. ఇక‌పై ట్రెయిన్ ప్రారంభం అవ‌డానికి 5 నిమిషాల ముందు కూడా టిక్కెట్ల‌ను రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌చ్చు. ఆయా టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కేవ‌లం ప్ర‌త్యేక రైళ్ల‌ను మాత్ర‌మే న‌డిపిస్తున్నారు. అయితే దేశంలో అనేక ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్న నేప‌థ్యంలో రైల్వే శాఖ కూడా రైళ్ల‌ను న‌డిపించేందుకు య‌త్నం చేస్తోంది. అందులో భాగంగానే కోవిడ్‌కు ముందున్న విధంగా రెండో రిజ‌ర్వేష‌న్ చార్ట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు య‌త్నిస్తోంది.

now passengers can buy reserved tickets 5 minutes before the departure of train

కాగా రైల్వే శాఖ అక్టోబ‌ర్ 10వ తేదీ నుంచి రెండో రిజ‌ర్వేష‌న్ చార్ట్ ను రైళ్ల‌కు అవి ప్రారంభం అయ్యేందుకు 30 నుంచి 5 నిమిషాల ముందు వ‌ర‌కు సిద్ధం చేయ‌నుంది. కోవిడ్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ప్ర‌త్యేక రైళ్ల‌కు రెండో రిజ‌ర్వేష‌న్ చార్ట్‌ను 2 గంట‌ల ముందుగా సిద్ధం చేస్తోంది. అయితే ఆ స‌మాయాన్ని ముందు తెలిపిన విధంగా మార్చ‌నున్నారు. దీంతో ప్ర‌యాణికులు రైళ్లు ప్రారంభం అయ్యేందుకు 5 నిమిషాల ముందు వ‌ర‌కు రిజ‌ర్వేష‌న్ టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. అలాగే టిక్కెట్ల‌ను క్యాన్సిల్ కూడా చేసుకోవ‌చ్చు.

ఇక కోవిడ్ నేప‌థ్యంలో రైల్వే శాఖ అన్ని జాగ్ర‌త్త‌ల‌ను తీసుకుంటూ అంత‌కు ముందున్న ప‌రిస్థితికి వ‌చ్చేందుకు య‌త్నిస్తోంది. అందులో భాగంగానే నెమ్మ‌దిగా రైలు స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తేనుంది. ఇక ప్ర‌యాణికులు అత్య‌వ‌స‌రం అయితేనే ప్ర‌యాణించాలి అంటూ వారికి రైల్వే శాఖ విజ్ఞ‌ప్తి చేయ‌నుంది. దీంతోపాటు స్టేష‌న్ల‌లో రిజ‌ర్వేష‌న్ కౌంట‌ర్ల వ‌ద్ద ర‌ద్దీని త‌గ్గించేందుకు కూడా రైల్వే శాఖ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో రైళ్లు ఇప్పుడ‌ప్పుడే ప్రారంభ‌మయ్యే అవ‌కాశం లేదు. కానీ నెమ్మ‌దిగా అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రైల్వే స‌ర్వీసుల‌ను రైల్వే శాఖ అతి త్వ‌ర‌లోనే అందుబాటులోకి తేనుంది.

Read more RELATED
Recommended to you

Latest news