ఏపీ సీఎం జగన్ ఏకంగా హైకోర్టు వ్యవహారాలు అన్నీ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తి ఎన్వీ రమణ కంట్రొల్ చేస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అయితే అది చర్చనీయాంశంగా మారింది. మా నాయకుడి మీద పదుల సంఖ్యలో కేసులు ఉన్నా భయపడకుండా లేఖ రాశారు అని వైసీపీ క్యాడర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది.
ఈ సమయంలో పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు అందాయి. అదేంటంటే ఏపీ హైకోర్టుకు సంబంధించిన వ్యవహారంపై తమ అభిప్రాయాన్ని వైఎస్ జగన్ గారు భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో తెలియజేసిన సంగతి మీకు తెలిసిందేనని, అయితే దయచేసి నాయకులెవరూ ఈ అంశంపైన పత్రికా సమావేశాలు పెట్టడం కానీ… పత్రికా ప్రకటనలు విడుదల చేయడం కానీ… కార్యక్రమాలు నిర్వహించడం కానీ చేయవద్దని ఆదేశాలు అందాయి. ఎక్కడైనా విలేకరులు దీనిపై పదే పదే అడిగితే దీనికి సంబంధించిన వివరాలు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగిందనీ… ఇక స్పందించాల్సిన అవసరం లేదని క్లుప్తంగా చెప్పండని పార్టీ పెద్దల నుండి కీలక నేతలకు సమాచారం అందింది.