మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్న తాప్సీ…!

-

సినీ నటి తాప్సీ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తోంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని నెలల పాటు ఇంటికే పరిమితమైన తాప్సీ… ఇటీవల తన చెల్లెళ్లతో కలిసి మాల్దీవుల విహారానికి వెళ్లారు. తాము మాల్దీవులకు ఎలా గడిపామనే ఫొటోలతో పాటు వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది తాప్సీ. టూర్‌లో భాగంగా తాప్సీ సిస్టర్స్‌ బీచ్‌లోని ఇసుకలో సరదాగా ఆటలాడడంతో పాటు స్క్యూబా డైవింగ్‌లో కూడా పాల్గొన్నారు.

ప్రస్తుతం ఈమె తమిళంలో విజయ్‌ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా షెడ్యూల్‌ జైపూర్‌లో పూర్తయ్యింది. తదుపరి షెడ్యూల్‌ ప్రారంభమయ్యే లోపు ఈ అమ్మడు చిల్‌ కావాలనుకుంది. వెంటనే తన ఫ్రెండ్స్‌,సిస్టర్ తో కలిసి మాల్దీవుల్లో వాలిపోయింది. అక్కడ బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది తాప్సీ.

Read more RELATED
Recommended to you

Latest news