సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మృతి

-

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మ్రృతి చెందారు. కిడ్నీ సంబందిత వ్యాదితో నిమ్స్ లో చెరిన మల్లేష్, ఆ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మల్లేష్ తన సేవలు అందించారు. తన రాజకీయ ప్రస్థానంలో 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఈయన 4 సార్లు గెలిచారు. ఒకప్పటి ఆసిఫాబాద్ నియోజకవర్గ పరిధిలో బెల్లంపల్లి ఉన్న సమయంలో గుండా మల్లేష్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసారు.

అలానే బెల్లంపల్లి నియోజకవర్గం ఏర్పాటు తర్వాత 2009, 2014లో రెండుసార్లు సిపిఐ తరపున బరిలో నిలిచారు. 1983, 85, 94 లో జరిగిన ఎన్నికల్లో ఈయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాడ్డాక 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు. ఇక రాష్ట్రం విడిపోయాక 2014లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య చేతిలో మహాకూటమి నుండి పోటీ చేసిన ఈయన పరాజయాన్ని చవిచూశారు. లారీ క్లీనర్ గా జీవితం మొదలు పెట్టిన ఈయన సిపిఐ శాసనసభా పక్ష నేతగా ఎదిగారు.

Read more RELATED
Recommended to you

Latest news