తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన కవితమ్మ..!

-

తెలంగాణలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు అయ్యాయి.. ఇప్పటికే మహిళలు రకరకాల పూలు సేకరించి బతుకమ్మలను సిద్ధం చేసే పని మొదలు పెట్టారు.ఇది ఇలా ఉండగా,తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. బతుకమ్మ పండుగ స్ఫూర్తితో అందరం కలిసికట్టుగా కరోనాను ఎదుర్కొని ,పోరాడదాం అంటూ సోషల్ మీడియాని వేదిక చేసుకొని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ,క్షేమంగా, సురక్షితంగా, హాయిగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలి అంటూ చెప్పారు. ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడ వద్దని సోషల్ మీడియాలో పేర్కొన్నారు కవిత.

కరోనా ‌కారణంగా చేత ఈ సంవత్సరం , తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించ‌డం కుదర్దము అని స్పష్టం చేసారు కవిత. బతుకమ్మ పండుగ సందర్భంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు అని, కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ సంబంరాలు జరుపుకోవాలని కూడా తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

Read more RELATED
Recommended to you

Latest news