బ్రేకింగ్ : నా సినిమా చేయకు.. సేతుపతికి ముత్తయ్య మురళీధరన్ లేఖ

-

విజయ్ సేతుపతి 800 సినిమాకి సంతకం చేసిన తర్వాత ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం వివాదాస్పదం అవుతున్న నేపధ్యంలో మురళీధరన్ విజయ్ సేతుపతిని సినిమా నుంచి వైదొలగాలని కోరుతూ ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖని విజయ్ సేతుపతి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఈ ప్రకటనను పంచుకున్నారు. మొత్తం తమిళంలోనే రాసిన ఆ లేఖలో ఉన్న విషయాన్ని స్థూలంగా చూస్తే ‘నా బయోపిక్ 800 చుట్టూ తమిళనాడులో చాలా వివాదాలు ఉన్నందున నేను ఈ ప్రకటన విడుదల చేస్తున్నాను.

నా బయోపిక్ సినిమాని చేస్తున్నందుకు విజయ్ కి వస్తున్న ఇబ్బందులు నాకు తెలుసు. విజయ్ సేతుపతి వెనుక ఉన్న నా అభిప్రాయాలను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తులు ఉన్నారు. తమిళనాడులోని ఉత్తమ నటులలో ఒకరు దీని ద్వారా వెళ్లాలని నేను కోరుకోను. అలాగే, భవిష్యత్తులో ఈ చిత్రానికి సంతకం చేసినందుకు విజయ్ సేతుపతికి ఎదురయ్యే పరిణామాల దృష్ట్యా సినిమా నుండి వైదొలగాలని నేను అభ్యర్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ లేఖని షేర్ చేస్తూ విజయ్ సేతుపతి థాంక్యూ, గుడ్ బై అని చెప్పడంతో ఆయన ఈ సినిమా నుండి తప్పుకుంటున్నట్టే అని చెప్పచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news