దుబ్బాకలో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

-

దుబ్బాక ఉపఎన్నికను గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నియోజకవర్గంలో సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రతి ఓటరును ప్రసన్నం చేసుకుంటూ…తమకే ఓటు వేయాలని నేతలు అభ్యర్థిస్తున్నారు. అభివృద్ధికి చిరునామా తామంటే తామేనంటూ టీఆర్ఎస్- కాంగ్రెస్‌లు సవాల్‌లు ప్రతి సవాల్‌లు విసురుకుంటున్నాయి. త్రిముఖ పోరులో తమదే గెలుపంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. టీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు ప్రచారాన్ని ఉరకలెత్తిస్తుండగా కాంగ్రెస్ నుంచి ఉత్తమ్,భట్టి,రేవంత్ ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి దుబ్బాక ఎన్నికను పర్యవేక్షిస్తున్నారు.

ఈరోజు ఉపసంహరణకు చివరితేదీగా నిర్ణయించ డంతో ఎన్నికల్లో నిలబడిన వారిలో చివరిదాకా 23 మంది తేలారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో 11 మంది అభ్యర్ధులు నామినేషన్లు ఉప సంహరణ చేసుకోగా 12 మంది అభ్యర్థులు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా వీరు తప్పుకోగా దుబ్బాక ఉప ఎన్నిక బరి లో 23 మంది అభ్యర్థులు తేలారు. దుబ్బాకలో నవంబర్ 3న పోలింగ్ …10న కౌంటింగ్ జరగనుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news