అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసి దివి తప్పు చేసిందా..?

-

బిగ్ బాస్ నాలుగవ సీజన్లో ఆదివారం ఎపిసోడ్ లో దివి హౌస్ నుండి బయటకు వచ్చేసింది. వైల్డ్ డాగ్ షూటింగ్ నిమిత్తం నాగార్జున, కులు మనాలి వెళ్ళడంతో హీరోయిన్ సమంత షోని హోస్ట్ చేసింది. పండగ సందర్భంగా ఎక్కువ సేపు సాగిన షో ప్రేక్షకులని బాగానే అలరించింది. ఐతే ఎలిమినేషన్ విషయంలో మాత్రం చాలా మందికి షాకింగ్ గా ఉంది. ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే దివి కూడా హౌస్ నుండి వెళ్ళిపోవడం కొంత మంది ప్రేక్షకులని బాధించింది. ఐతే దివి వెళ్ళిపోవడానికి ముఖ్య కారణం అమ్మ రాజశేఖర్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేయడం వల్లే దివి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని చెబుతున్నారు. అమ్మ రాజశేఖర్ ని దివి సరిగ్గా అంచనా వేయలేకపోయిందని, నిజంగా స్నేహం చేస్తున్నాడనే అనుకుందని, కానీ అతను మాత్రం గాళ్ ఫ్రెండ్ అంటూ ఇతరులతో చెప్పడం లాంటివి చేసాడని అంటున్నారు. అంత తొందరగా ఎవ్వరితోనూ ఫ్రెండ్ షిప్ ఏర్పర్చుకోనని చెప్పిన దివి, అమ్మ రాజశేఖర్ తో ఫ్రెండ్ షిప్ చేసి తప్పు చేసిందని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా రియాలిటీ షోలో రియల్ గా గేమ్ ఆడే వాళ్లందరూ ఎలిమినేట్ అవుతున్నారని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news