ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన కృష్ణాయపాలెంలో హైఅలెర్ట్ వాతావరణం నెలకొంది. కృష్ణయపాలెంలో బి సి రైతులపై ఎస్ సి, ఎస్ టి కేసులు నమోదు చేసి వారికి సంకెళ్ళు వేసి జైలు కు తరలించడం పై రాజధాని జె ఏ సి ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 3 రోజులు పాటు నిరసన కార్యక్రమాలుకు జెఎసి పిలుపునిచ్చింది. 3 వ రోజు గుంటూరు జిల్లా జైల్ కు భారీగా తరలి రావాలని ఛలో గుంటూరు కార్యక్రమంకు పిలుపునిచ్చారు.
తుళ్ళూరు సహా అన్ని గ్రామాల్లో రైతులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తుళ్ళూరు, రాయపూడి, వెలగపూడి, మందడం లో, ఉద్దండరాయని పాలెం ల లో జెఎసి నేతలను అరెస్ట్ చేసారు. తుళ్ళూరు లో కె అప్పారావు, వెలగపూడి లో జె మనోజ్, జె ప్రదీప్, రాయపూడి లో దళిత జెఎసి నేతలు చిలక బసవయ్య, కంభంపాటి శిరీష, మందడం లో వి వీరంజనేయు లు తో పాటు పలువురు వంటి నేతలు హౌస్ అరెస్ట్ అయ్యారు.