బిగ్ బాస్ సీజన్ 4 విజయవంతంగా ఎనిమిదో వారం చివరికి చేరుకుంది. అన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో కలుపుకుని మొత్తం 19 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ టైటిల్ కోసం పోటీ పడగా రేపటికి హౌస్‌లో 11 మంది మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి లాస్య, అభిజిత్, అఖిల్, మోనాల్, మెహబూబ్, సొహైల్, అరియానా, అమ్మా రాజశేఖర్, అవినాష్‌లు హౌస్‌లో ఉన్నారు. నిన్న కాక మొన్న నోయల్ కి అనారోగ్యంతో బయటకు వచ్చేశాడు.
దీంతో ఈ వారం ఎలిమినెట్ అయ్యేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. ఎనిమిదో వారం వచ్చేసరికి అమ్మా రాజశేఖర్ మెహబూబ్, అరియానా, మెహబూబ్, లాస్య, మోనాల్, అఖిల్ లు నామినేషన్ లో ఉన్నారు. ఈ వారం అమ్మా రాజశేఖర్, మెహబూబ్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట అవుతారని ముందు నుండీ ప్రచారం జరగగా అదేమీ లేదని తేలిపోయింది. ప్రతి వారంలానే ఈ వారం కూడా వచ్చిన లీకేజ్ ల ప్రకారం ఈ వారం నో ఎలిమినేషన్… ఎందుకంటే నోయల్ వెళ్ళిపోవడంతో మరొకరిని ఎవరినీ ఎలిమినేట్ చేయడం లేదు. లేదా తప్పుడు లీకేజ్ ఇచ్చి అమ్మా రాజశేఖర్ లేదా మెహబూబ్‌లలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయవచ్చు.