ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ ఒకటో తేదీ అంటే ఈరోజున నిర్వహించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నిజానికి 2014 లో రాష్ట్ర విభజన తర్వాత నుంచి అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించలేదు. అప్పటినుంచి అవతరణ దినోత్సవంపై తర్జన భర్జనలు జరుగుతున్నా అది మొన్నటి దాకా తేలలేదు. అయితే ఏపీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకు ముందు భాషా ప్రయుక్త రాష్ట్రాలలో అవతరణ దినోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అవరతణ దినోత్సవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 1న నిర్వహించేవారు. అయితే రాష్ట్ర విభన తర్వాత నుంచి ఏపీలో అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడూ అధికారికంగా నిర్వహించలేదు. తెలంగాణ ఏర్పాటైన జూన్ 2న అక్కడి ప్రభుత్వం ఆరోజున ఘనంగా వేడుకలు జరుపుతున్నది. ఆ రోజును అపాయింటెడ్ డే గా ప్రకటించడంతో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జూన్ 2న ఏపీకి జరిగిన నష్టానికి నిరసనగా నవనిర్మాణ దీక్ష చేపట్టేవారు. ఈ సారి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.